Share News

పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు: అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Sep 06 , 2026 | 11:07 AM

ఎఫ్‌సీవీ పొగాకు మార్కెట్‌లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు: అచ్చెన్నాయుడు
AP tobacco farmers

ఇంటర్‌నెట్ డెస్క్: ఎఫ్‌సీవీ పొగాకు మార్కెట్‌లో పరిస్థితులు మెరుగవుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో పొగాకు వేలం కేంద్రాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు విక్రయం జరిగిందన్నారు. ప్రస్తుతం సగటు ధర కిలోకు రూ.209.83 పలుకుతోందని వెల్లడించారు. అధిక ఉత్పత్తి కారణంగా మార్కెట్‌పై ఒత్తిడి ఏర్పడిందని పేర్కొన్నారు.


మంత్రి అచ్చెన్నాయుడు తన ప్రకటనలో.. ‘'నో-బిడ్' బేల్స్ 11-12 శాతానికి తగ్గినట్లు వెల్లడవుతోంది. కొన్ని వేలం కేంద్రాల్లో 'నో-బిడ్'లు 1-2 శాతం మాత్రమే ఉన్నాయి. కొనుగోలుదారుల పోటీ పెరగడంతో ధరలు మెరుగుపడుతున్నాయి. వారానికి 10 మిలియన్ కిలోల పొగాకు విక్రయం జరుగుతోంది. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో కిలోకు గరిష్ఠంగా రూ.329 ధర పలుకుతోంది. SLSలో రూ.255, SBSలో రూ.252 గరిష్ఠ బిడ్ ఉంటోంది’..


‘వేలం కేంద్రాల్లో సమస్యల పరిష్కారానికి అధికారులు పర్యటిస్తున్నారు. 2026-27లో FCV పంట పరిమాణం 142 నుంచి 81 మిలియన్ కిలోలకు తగ్గించాము. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి నియంత్రణే మా లక్ష్యం. రైతులు అనుమతించిన మేరకే సాగు చేయాలని టొబాకో బోర్డుతో అవగాహన కుదిరింది. వేలం పూర్తయ్యే వరకు రైతులకు పూర్తి సహకారం అందిస్తాం’ అని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

గంగబాయిలమ్మ ఆకుకూర

పిల్లలకు డబ్బు విలువ తెలియాల్సిందే...

Updated Date - Sep 06 , 2026 | 11:15 AM