2.80 కోట్లతో ఆయుష్ కేంద్రాల ఆధునికీకరణ
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:52 AM
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్తగా మరికొన్ని చర్యలు చేపట్టిందని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వివరించారు.
ఒక్కో కేంద్రానికి రూ.20 లక్షలు కేటాయింపు
అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఆయుష్ వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కొత్తగా మరికొన్ని చర్యలు చేపట్టిందని ఆయుష్ డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ వివరించారు. జాతీయ ఆయుష్ మిషన్-2026-27 వార్షిక ప్రణాళికలో భాగంగా ఈ పనులకు కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. 64 ఆయుష్ వైద్య కేంద్రాలను ఆధునిక వసతులతో తీర్చిదిద్దనుందని చెప్పారు. ఒక్కో కేంద్రానికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.12.80 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు.
దెబ్బతిన్న పాత భవనాలకు మరమ్మతులు, అవసరమైన చోట కొత్త భవనాలు నిర్మిస్తామని తెలిపారు. అన్ని కేంద్రాల్లోనూ ఒకే తరహా భవన నమూనా, ఒకే స్థాయి వసతులు కల్పిస్తామని చెప్పారు. రోగులు వేచి ఉండేందుకు ప్రత్యేక గది, వైద్యులు పరీక్షించేందుకు మరో గది, మందుల నిల్వకు ప్రత్యేక విభాగం, రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రయోగశాల ఏర్పాటు చేస్తారన్నారు. తాగునీరు, విద్యుత్తు, మరుగుదోడ్లు, భద్రత వంటి సదుపాయాలను కల్పిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌కు వివరించారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 8 కేంద్రాలు, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో ఒక్కో కేంద్రం నిర్మించనున్నట్టు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా