Share News

7 నుంచి ఎంఎస్ఎంఈ ప్రాంతీయ సదస్సులు

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:26 AM

రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి ఎంఎస్ఎంఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

7 నుంచి ఎంఎస్ఎంఈ ప్రాంతీయ సదస్సులు

పెట్టుబడుల సదస్సుకు సన్నాహకంగా నిర్వహణ: కొండపల్లి

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఈ నెల 7వ తేదీ నుంచి ఎంఎస్ఎంఈ ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో వచ్చే నెల 12, 13 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న పెట్టుబడుల సదస్సు (సీఐఐ పార్ట్‌నర్‌ సమ్మిట్‌-2026)కు సన్నాహకంగా ఈనెల 7న విశాఖపట్నం, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతి నగరాల్లో ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మంత్రి గురువారం ఒక ప్రకటనలో వివరించారు. స్థానిక చిన్న తరహా పరిశ్రమలకు మార్కెట్‌ అవకాశాలు కల్పించేందుకు ‘వెండర్‌ డెవల్‌పమెంట్‌, బయ్యర్‌-సెల్లర్‌ సమావేశాలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్ట్‌పలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, విద్యార్థులు, ఎంఎస్ఎంఈ యూనిట్ల నిర్వాహకులు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:26 AM