వైసీపీ నేతల దుశ్శాసన పర్వం!
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:00 AM
పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంఆర్ నగరం గ్రామంలో టీడీపీకి చెందిన ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కుటుంబంలోని మహిళ, ప్రస్తుతం ఇదే గ్రామంలో టీడీపీ మద్దతుతో ...
కుటుంబసభ్యులపై పిడిగుద్దులు
మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పనిచేయడమే నేరం
నిందితుల అరెస్టుకు ఎమ్మెల్యే డిమాండ్
పార్వతీపురం మన్యంలో ఘటన
టీడీపీ మద్దతున్న సర్పంచ్ అభ్యర్థి చీర లాగి, జాకెట్ చించేసిన వైనం
పార్వతీపురం మన్యంలో దారుణం
పార్వతీపురం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాలోని ఎంఆర్ నగరం గ్రామంలో టీడీపీకి చెందిన ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కుటుంబంలోని మహిళ, ప్రస్తుతం ఇదే గ్రామంలో టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా పోటీ చేస్తున్న సుభద్రమ్మపై దుశ్శాసన పర్వానికి పాల్పడ్డారు. ‘‘నన్ను తీవ్రంగా కొట్టడమే కాకుండా చీర లాగేశారు. జాకెట్ చించేశారు.’’ అని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. మిగిలిన కుటుంబ సభ్యులపైనా వైసీపీ మూక విరుచుకుపడిందన్నారు.
ఇటీవల జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో ఈ కుటుంబం టీడీపీకి అనుకూలంగా పనిచేసింది. ప్రస్తుతం ఇదే కుటుంబం నుంచి సుభద్రమ్మ సర్పంచ్ బరిలో నిలిచారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయిన వైసీపీ నేతలు సుమారు 50 మంది.. బుధవారం ఉదయం ఈ కుటుంబంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. పిడిగుద్దులు గుద్దారు. వైసీపీ దాడిలో సర్పంచ్ అభ్యర్థి రొంపిల్లి సుభద్రమ్మతో పాటు ఆమె భర్త తిరుపతిరావు, కుమారుడు ప్రభాకరరావు, మాజీ సర్పంచ్ వంగపండు త్రినాథనాయుడు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన వైసీపీ నేత బడే రామారావు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లు టీడీపీ నాయకులు ఆరోపించారు.
బాధితులు ఒంటరిగా ఉన్న సమయంలో సుమారు 50 మంది వారిపై దాడి చేశారని, తిరుపతిరావును నేలకేసి కొట్టడంతో పాటు ప్రభాకరరావుపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారని తెలిపారు. సర్పంచ్ అభ్యర్థి సుభద్రమ్మపై పప్పల ప్రసాద్, పప్పల హేమంత్ దాడి చేసి చీర లాగి, జాకెట్ చించేశారని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు పని చేశారనే కక్షతోనే ఈ దాడి చేశారని తెలిపారు.
ఎమ్మెల్యే ఆందోళన
దాడి సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజేశ్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామానికి చేరుకుని బడే రామారావుతో పాటు పలువురు వైసీపీ నాయకులను పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. మరికొందరు ఇళ్లలో దాక్కున్నారని టీడీపీ నాయకులు.. ఎమ్మెల్యే విజయచంద్రకు వివరించారు. దీంతో దాడికి పాల్పడిన వారిని బయటకు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే విజయచంద్ర, ఎంపీపీ బోను దేవిచంద్రమౌళి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
అనంతరం పోలీసులు ఇళ్లలో దాక్కున్న కొందరు వైసీపీ నాయకులను వ్యాన్‌లో తరలించారు. కాగా, వైసీపీ నేతలు తమ పార్టీ నాయకులను దారుణంగా కొట్టారని టీడీపీ మాజీ సర్పంచ్ వంగపండు లక్ష్మి తెలిపారు. తన కళ్ల ముందే భర్త త్రినాథనాయుడు, రొంపిల్లి తిరుపతిరావు, ప్రభాకరరావుపై దాడి చేశారని చెప్పారు. తమ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి సుభద్రమ్మ చీర లాగి, జాకెట్ చించేశారని తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్