Share News

రాయితీ విత్తన పంపిణీకి డీ-కృషి యాప్‌

ABN , Publish Date - Oct 23 , 2026 | 05:52 AM

డీ-కృషి యాప్‌ ద్వారా రాయితీ విత్తనాల పంపిణీకి సంబంధించి, రైతుల ధ్రువీకరణ, సంక్షిప్త సమాచార వ్యవస్థ విధానంలో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 నుంచి గ్రామస్థాయిలో రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీకి ..

రాయితీ విత్తన పంపిణీకి డీ-కృషి యాప్‌

అమరావతి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): డీ-కృషి యాప్‌ ద్వారా రాయితీ విత్తనాల పంపిణీకి సంబంధించి, రైతుల ధ్రువీకరణ, సంక్షిప్త సమాచార వ్యవస్థ విధానంలో ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఈమేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 నుంచి గ్రామస్థాయిలో రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీకి ప్రభుత్వం ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించింది. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఈ విధానాన్ని సవరించింది. అసలైన రైతులకు రాయితీ విత్తనాలు చేరేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సవరణలు చేపట్టింది.

విత్తన పంపిణీ, చెల్లింపుల సమయంలో రైతులు తప్పనిసరిగా డీ-కృషి యాప్‌లో బయోమెట్రిక్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌, లేదా ఆధార్‌ అనుసంధాన మొబైల్‌ నంబరుకు పంపిన ఓటీపీ ద్వారా రైతుల్ని ధ్రువీకరించాలని తాజా ఉత్తర్వుల్లో నిర్ధేశించింది. రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జి డీ-కృషి యాప్‌ ద్వారా రైతును గుర్తించి, రిజిస్ట్రేషన్‌ ఐడీని రైతు మొబైల్‌కు పంపనున్నారు. అలాగే విత్తన పంపిణీ, చెల్లింపుల్లోనూ ఇదే విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

సమన్వయంతో పనిచేయండి

అప్పుల ఊబిలో యువత

Updated Date - Oct 23 , 2026 | 05:52 AM