Share News

మంత్రి లోకేశ్‌ను కలిసిన.. మిషన్ శక్తిశాట్‌కు ఎంపికైన విద్యార్థిని

ABN , Publish Date - Jul 27 , 2026 | 08:28 PM

'మిషన్ శక్తిశాట్'కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని కందుల జెస్సీ సోమవారం మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. మంత్రి నారా లోకేష్.. జెస్సీని అభినందించారు. జెస్సీకి అన్ని విధాల మద్దతుగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు.

మంత్రి లోకేశ్‌ను కలిసిన.. మిషన్ శక్తిశాట్‌కు ఎంపికైన విద్యార్థిని
Kandula Jessy

అమరావతి, జులై 27: 'మిషన్ శక్తిశాట్'కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ విద్యార్థిని కందుల జెస్సీ సోమవారం మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. మంత్రి నారా లోకేష్.. జెస్సీని అభినందించారు. జెస్సీకి అన్ని విధాల మద్దతుగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఏపీలో స్పేస్ సిటీ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు. అంతరిక్ష రంగంలో యువతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా మిషన్ శక్తిశాట్ పోస్టర్‌ను మంత్రి లోకేశ్ ఆవిష్కరించారు. జెస్సీ మాట్లాడుతూ.. ‘అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రయోగాలతో అంతరిక్షంపై ఆసక్తి పెరిగింది. భవిష్యత్ లక్ష్యం ఏరోనాటికల్ ఇంజనీర్ కావడమే’ అని అన్నారు.


ఏపీ నుంచి ఏకైక విద్యార్థిని..

ప్రపంచంలోనే తొలి ఆల్-గర్ల్స్ లూనార్ క్యూబ్‌శాట్ మిషన్ 'మిషన్ శక్తిశాట్'కు ఎంపికై కందుల జెస్సీ రికార్డు సృష్టించారు. భారత్ నుంచి ఎంపికైన 20 మంది బాలికల్లో జెస్సీ చోటు దక్కించుకుని.. ఈ ఘనత సాధించిన ఏకైక ఆంధ్రప్రదేశ్ విద్యార్థినిగా నిలిచారు. 108 దేశాల నుంచి సుమారు 12 వేల మంది బాలికలు ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోగా.. పలు దశల ఎంపిక ప్రక్రియ అనంతరం జెస్సీ తుది జాబితాలో స్థానం సంపాదించారు. ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జిల్లాకే కాకుండా రాష్ట్రానికీ గర్వకారణంగా మారింది.


ఇవి కూడా చదవండి

విద్యార్థిని శివానీ ఆత్మహత్య.. ఫోరెన్సిక్‌కు సూసైడ్‌ నోట్‌

బిర్యానీ ఆకు.. సహజమైన హెయిర్ కండీషనర్‌గా ఉపయోగపడుతుందా?

Updated Date - Jul 27 , 2026 | 10:07 PM