Share News

ప్రత్యేక టెట్‌ రెస్పాన్స్‌ షీట్లు విడుదల

ABN , Publish Date - Oct 29 , 2026 | 05:01 AM

ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రత్యేక టెట్‌ రెస్పాన్స్‌ షీట్లను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది.

ప్రత్యేక టెట్‌ రెస్పాన్స్‌ షీట్లు విడుదల

అమరావతి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు నిర్వహించిన ప్రత్యేక టెట్‌ రెస్పాన్స్‌ షీట్లను పాఠశాల విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. టీచర్లు వారి వ్యక్తిగత లాగిన్‌ ద్వారా రెస్పాన్స్‌ షీట్లు చూసుకోవచ్చని టెట్‌ కన్వీనర్‌ ఎంవీ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రాథమిక కీపై నవంబరు 4 వరకు అభ్యంతరాలు తెలపవచ్చన్నారు. టీచర్లు వారి లాగిన్‌ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలపాలని, ఇతర రూపాల్లో వచ్చే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 05:01 AM