నేటి నుంచి స్పెషల్ టెట్
ABN , Publish Date - Oct 11 , 2026 | 03:19 AM
ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న స్పెషల్ టెట్ పరీక్షలు ఆదివారం ప్రారంభమవుతున్నాయి. దీనిపై స్పెషల్ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న స్పెషల్ టెట్ పరీక్షలు ఆదివారం ప్రారంభమవుతున్నాయి. దీనిపై స్పెషల్ టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. 68,420 ఉపాధ్యాయులు 83,015 దరఖాస్తులు సమర్పించారని తెలిపారు. 11 నుంచి 15 వరకు ఐదు రోజుల పాటు పరీక్షలు జరుగుతాయన్నారు. పది సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలో 64, పొరుగు రాష్ర్టాల్లో 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణలో మూడు, చెన్నైలో రెండు, బెంగళూరులో రెండు, బరంపురంలో రెండు కేంద్రాలు ఉన్నాయన్నారు. రోజూ ఉదయం సెషన్ 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం