Share News

వాణిజ్య కనెక్షన్లకు ‘స్మార్ట్‌’ కట్‌

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:38 AM

రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు, వాణిజ్య భవన సముదాయాలకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసిన విద్యుత్తు శాఖ తాజాగా బిల్లుల చెల్లింపునకు స్మార్ట్‌ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది.

వాణిజ్య కనెక్షన్లకు ‘స్మార్ట్‌’ కట్‌

  • కరెంటు బిల్లు గడువులోగా చెల్లించకపోతే సరఫరా నిలిపివేత

  • మూడు డిస్కంల పరిధిలో కొత్త విధానం అమల్లోకి

రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలు, వాణిజ్య భవన సముదాయాలకు స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటు చేసిన విద్యుత్తు శాఖ తాజాగా బిల్లుల చెల్లింపునకు స్మార్ట్‌ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. గడువులోగా బిల్లులు చెల్లించనివారికి స్మార్ట్‌ విధానంతో విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నారు. ఇప్పటి వరకు బిల్లు చెల్లించని వారి వద్దకు లైన్‌మన్లు వెళ్లి ఫ్యూజులు తొలగించేవారు. స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర కార్యాలయం నుంచే సరఫరా నిలిపివేసే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం మూడు డిస్కంల పరిధిలో పరిశ్రమలు, వాణిజ్య కనెక్షన్లకు స్మార్ట్‌ విధానంలో బిల్లుల చెల్లింపును పర్యవేక్షిస్తున్నారు. గృహ కనెక్షన్లకు ఇంకా స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయనందున పాత విధానాన్నే కొనసాగించనున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 05:43 AM