Share News

పీఆర్సీ కమిషనర్‌ వేతనం రూ.2.25 లక్షలు

ABN , Publish Date - Nov 25 , 2026 | 05:39 AM

పన్నెండో పీఆర్సీ కమిషనర్‌ నియామక నిబంధనలు, షరతులను ఖరారు చేస్తూ ప్రభుత్వం మంగళవా రం ఉత్తర్వులు జారీ చేసింది.

పీఆర్సీ కమిషనర్‌ వేతనం రూ.2.25 లక్షలు

  • నియామక నిబంధనలతో జీవో జారీ

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): పన్నెండో పీఆర్సీ కమిషనర్‌ నియామక నిబంధనలు, షరతులను ఖరారు చేస్తూ ప్రభుత్వం మంగళవా రం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ దినేశ్‌ కుమార్‌ను నియమిస్తూ అక్టోబరు 1న జారీ చేసిన ఉత్తర్వులకు కొనసాగింపుగా సాధారణ పరిపాలనశాఖ తాజాగా ఈ జీవో ఇచ్చింది.

పీఆర్సీ కమిషనర్‌కు నెలకు రూ.2,25,000 వేతనం చెల్లిస్తారు. ఈ వేతనంపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంజూరు చేసే కరువు భత్యానికి ఆయన అర్హులు. అయితే, పునర్నియామక కాలంలో పింఛనుపై ఇచ్చే కరువు భత్యం వర్తించదు. ఇంటి అద్దె భత్యం తదితర సదుపాయలతో జీవో జారీ చేశారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

Updated Date - Nov 25 , 2026 | 05:43 AM