Share News

చేనేత, హస్తకళలకు భౌగోళిక గుర్తింపు

ABN , Publish Date - Nov 12 , 2026 | 05:03 AM

రాష్ట్రంలో చేనేత, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియో ట్యాగ్‌), వాటి నాణ్యత పెంపు, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ అంశాలలో సహకారం అందించాలని వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌..

చేనేత, హస్తకళలకు భౌగోళిక గుర్తింపు

  • విపో డీజీతో భేటీలో సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో చేనేత, హస్తకళలు, స్థానిక ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియో ట్యాగ్‌), వాటి నాణ్యత పెంపు, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ అంశాలలో సహకారం అందించాలని వరల్డ్‌ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఆర్గనైజేషన్‌ (ప్రపంచ మేధో సంపత్తి సంస్థ-విపో) డైరెక్టర్‌ జనరల్‌ డారెన్‌ టాంగ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. బుధవారం విశాఖలో వీరివురూ భేటీ అయ్యారు. విపోతో కలిసి ఆంధ్రప్రదేశ్‌ అకాడమీ ఏర్పాటు, విద్యార్థుల భాగస్వామ్యం, పరిశోధకులు, స్టార్టప్‌ వ్యవస్థాపకులు, ఎంఎస్ఎంఈలకు మేధో సంపత్తి హక్కులు, పేటెంట్లు, ట్రేడ్‌ మార్క్‌లు, డిజైన్లు, సాంకేతిక పరిజ్ఞాన పరిరక్షణపై శిక్షణ అవకాశాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని విపో ప్రతినిధులను ఆహ్వానించారు. మహిళా సాధికారతలో విపో భాగస్వామ్యం కావాలని ప్రతినిధులను కోరారు. డారెన్‌ టాంగ్‌ స్పందిస్తూ.. క్వాంటమ్‌ టెక్నాలజీని ప్రోత్సహించడంలో ఏపీ ముందున్నదని ప్రశంసించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 05:03 AM