Share News

క్రమబద్ధీకరణ చట్టంలోకి సెకండరీ హెల్త్‌ కాంట్రాక్టు ఉద్యోగులు

ABN , Publish Date - Sep 29 , 2026 | 03:45 AM

రాష్ట్రంలోని సెకండరీ హెల్త్‌ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రభుత్వ శాఖల్లో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు...

క్రమబద్ధీకరణ చట్టంలోకి సెకండరీ హెల్త్‌ కాంట్రాక్టు ఉద్యోగులు

  • 2023 నుంచి వర్తించేలా సవరణ

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • తొలగిన చట్టపరమైన చిక్కులు

అమరావతి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సెకండరీ హెల్త్‌ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ప్రభుత్వ శాఖల్లో అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు వీలుగా గతంలో తెచ్చిన ‘యాక్ట్‌ నం.30-2023’ పరిధిలోకి ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌’ విభాగాన్ని కూడా చేరుస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోతో సెకండరీ హెల్త్‌ డైరెక్టరేట్‌లోని వందలాది మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఉన్న చట్టపరమైన చిక్కులు తొలగిపోయాయి.

ఈ వార్తలనూ చదవండి...

పింఛనుదారులకు గుడ్‌న్యూస్‌.. అక్టోబర్‌ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ

పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..

Updated Date - Sep 29 , 2026 | 03:45 AM