ఏకగ్రీవ పంచాయతీల్లో వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:03 AM
గ్రామ పంచాయతీలకు జరుగుతున్న సాధారణ ఎన్నికలు- 2026లో భాగంగా, సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ ఎన్నికను అదే రోజు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సృష్టం చేసింది.
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీలకు జరుగుతున్న సాధారణ ఎన్నికలు- 2026లో భాగంగా, సర్పంచ్‌తోపాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ ఎన్నికను అదే రోజు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సృష్టం చేసింది. ఈమేరకు రిటర్నింగ్ అధికారులకు తగిన సూచనలు జారీ చేయాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి కోరిన వివరణకు స్పందించిన ఆయన ఈమేరకు సృష్టత ఇస్తూ డీపీవోలకు లేఖ రాశారు.
ఎంపీపీగా మంత్రి భార్య
అన్నమయ్య: అన్నమయ్య జిల్లా చిన్నమండెం ఎంపీపీగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భార్య హరితమ్మ ఎంపికయ్యారు. మండలంలోని పడమటికోన ఎంపీటీసీగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్