Share News

ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు వెబ్‌కాస్టింగ్‌: ఎస్‌ఈసీ

ABN , Publish Date - Nov 27 , 2026 | 06:37 AM

రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు ...

ఎన్నికల సరళిని పర్యవేక్షించేందుకు వెబ్‌కాస్టింగ్‌: ఎస్‌ఈసీ

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు విస్తృత స్థాయిలో సీసీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా తెలిపారు.

గురువారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ పర్యవేక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందుతున్న పోలింగ్‌ దృశ్యాలను పరిశీలించి, మీడియాకు పోలింగ్‌ సరళిని వివరించారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 06:38 AM