డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ల ఎన్నికకు షెడ్యూల్ విడుదల
ABN , Publish Date - Nov 28 , 2026 | 01:59 AM
రాష్ట్రంలోని 4 మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్‌చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది.
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 4 మున్సిపల్ కార్పొరేషన్లలో డిప్యూటీ మేయర్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైస్‌చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది. డిసెంబరు 5న పరోక్ష పద్ధతిలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా శుక్రవారం వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించిన నోటీసులను డిసెంబరు 1వ తేదీలోగా జారీ చేయాలని ఆదేశించారు.
అనివార్య కారణాలతో డిసెంబరు 5న ఎన్నిక నిర్వహించడం సాధ్యం కాకపోతే మరుసటి రోజు నిర్వహించాలని స్పష్టం చేశారు. గతంలో నవంబరు 23, 24 తేదీల్లో నిర్వహించాల్సిన నర్సీపట్నం, మాచర్ల మున్సిపాలిటీల వైస్‌చైర్మన్ల పరోక్ష ఎన్నికలు కొన్ని కారణాలతో జరగలేదు. ఈ రెండు మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని తాజా షెడ్యూల్‌లో ప్రకటించారు. డిసెంబరు 5న వీటికి కూడా నిర్వహించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు
బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..