ఉపాధ్యాయుల పనితీరుపై సమీక్ష
ABN , Publish Date - Sep 25 , 2026 | 05:15 AM
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పనితీరుపై సమీక్షకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. విద్యాహక్కు చట్టంలో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ సూచికల అమలులో భాగంగా చర్యలు చేపట్టింది. అభ్యసన ఫలితాల ఆధారంగా బోధించడం, మొదటి జనరేషన్ విద్యార్థులను వివిధ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడాన్ని ఒకటో సూచికగా పేర్కొన్నారు.
ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ
ఎన్‌సీఈఆర్‌టీ సూచికల అమలుకు చర్యలు
అమరావతి, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పనితీరుపై సమీక్షకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. విద్యాహక్కు చట్టంలో భాగంగా ఎన్‌సీఈఆర్‌టీ సూచికల అమలులో భాగంగా చర్యలు చేపట్టింది. అభ్యసన ఫలితాల ఆధారంగా బోధించడం, మొదటి జనరేషన్ విద్యార్థులను వివిధ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడాన్ని ఒకటో సూచికగా పేర్కొన్నారు. రెండో సూచికలో సబ్జెక్టును స్పష్టంగా, తగిన ఉదాహరణలతో బోధించడం, విద్యార్థుల్లో తప్పులు, సందేహాలు, అపోహలను గుర్తించి పరిష్కరించడం వంటి అంశాలున్నాయి. ఇక మూడో సూచికలో తరగతి గదిని వివిధ కార్యకలాపాలకు వినియోగించడం, పాఠశాల పరిశుభ్రతను పరిరక్షించడం, విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత, స్వీయ క్రమశిక్షణను పెంపొందించడం, విద్యార్థుల హాజరు మెరుగుపరచడం, విద్యార్థి కేంద్రంగా బోధనా విధానాలు అనుసరించడం, విద్యార్థులు చెప్పేది ఓపికగా వినడం, విద్యార్థుల పురోగతిని తల్లిదండ్రులతో పంచుకోవడం ఉన్నాయి. నాలుగో సూచికలో విద్యార్థులు, సహచర ఉపాధ్యాయులతో సత్సంబంధాలు కొనసాగించడం, ఐదో సూచికలో స్వీయ అభ్యాసం ద్వారా విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకోవడం, ఇన్ సర్వీస్ విద్యా కార్యక్రమాల్లో పాల్గొనడం ఉండగా, ఆరో సూచికలో ఉదయం అసెంబ్లీ నిర్వహణ, టైమ్ టేబుల్, పరీక్షలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల బాధ్యతల నిర్వహణ పొందుపరిచారు.
ఈ వార్తలనూ చదవండి...
అదానీ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం.. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు..