Share News

రంగంపేట యువతికి అరుదైన గుర్తింపు

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:33 AM

ఒడిశా రాష్ట్రంలో నిర్వహించనున్న 16వ అంతర్జాతీయ సైకత శిల్పకళా ఉత్సవం-2026కు తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి

రంగంపేట యువతికి అరుదైన గుర్తింపు

  • అంతర్జాతీయ సైకత శిల్పకళా ఉత్సవానికి ఎంపిక

  • డిసెంబరు 1 నుంచి కోణార్క్‌లో నిర్వహణ

రంగంపేట, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ఒడిశా రాష్ట్రంలో నిర్వహించనున్న 16వ అంతర్జాతీయ సైకత శిల్పకళా ఉత్సవం-2026కు తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్‌ కుమార్తె దేవిన సోహిత ఎంపికయ్యారు. ఈ మేరకు ఒడిశా ప్రభుత్వ పర్యాటక శాఖ నుంచి నవంబరు 13న అధికారిక ఆహ్వాన లేఖ అందింది. డిసెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు కోణార్క్‌ ఉత్సవంలో భాగంగా చంద్రబాగా బీచ్‌లో ఈ అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించనున్నారు.

ఐదు రోజులపాటు ఈ ఉత్సవంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 25 దేశాల నుంచి 150 మంది సైకత శిల్పకళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. ప్రతిరోజూ నిర్వాహకులు సూచించిన అంశం ఆధారంగా కొత్తశిల్పాలను రూపొందించాల్సి ఉంటుంది. శిల్పాల తయారీకి సముద్ర తీరంలోని ఇసుక మాత్రమే వినియోగించాలి. ఈ ఉత్సవంలో ఐదు రోజుల ప్రదర్శన ఆధారంగా కళాకారుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. రంగంపేటకు చెందిన దేవిన సోహిత అంతర్జాతీయస్థాయి సైకత శిల్పకళా ఉత్సవానికి ఎంపిక కావడంపట్ల స్థానికులు, కళాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ సోహితను అభినందించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 05:35 AM