ఆటో డ్రైవర్లకు 231.13 కోట్లు విడుదల
ABN , Publish Date - Nov 18 , 2026 | 02:12 AM
సొంతంగా ఆటోరిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్‌లు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.231.13 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): సొంతంగా ఆటోరిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్‌లు నడుపుకొంటూ జీవనం సాగిస్తున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు రూ.231.13 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కో డ్రైవరుకు ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నిధులనూ విడుదల చేసింది. ఈమేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జీఓ ఆర్టీ నంబరు 142ను విడుదల చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు