ఆగిపోయిన ‘సురక్ష’
ABN , Publish Date - Nov 10 , 2026 | 03:59 AM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడానికి తీసుకొచ్చిన మొబైల్ యాప్ ‘సురక్ష’ విశ్రాంతి తీసుకుంటోంది. కొద్ది నెలలుగా ఈ యాప్, వెబ్‌సైట్ సేవలు...
కొన్ని నెలలుగా పనిచేయని పోలీసు యాప్, వెబ్‌సైట్
సాఫ్ట్‌వేర్ సంస్థకు చెల్లింపులు నిలిచిపోవడమే కారణం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడానికి తీసుకొచ్చిన మొబైల్ యాప్ ‘సురక్ష’ విశ్రాంతి తీసుకుంటోంది. కొద్ది నెలలుగా ఈ యాప్, వెబ్‌సైట్ సేవలు నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేయడానికి, చేసిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయి? వాహనాలపై ఉన్న జరిమానాలు తెలుసుకోవడానికి వీలుగా ఏపీపోలీ్‌స.జీవోవీ.ఇన్‌తో వెబ్‌సైట్‌ను తయారు చేశారు.
ఈ ఫీచర్లతోనే సురక్ష మొబైల్ యాప్‌ను రూపొందించారు. పోలీసు శాఖతోపాటు ప్రజలకు ఈ రెండింటిలోకి యాక్సిస్ ఇచ్చారు. కొన్ని నెలలుగా ఈ వెబ్‌సైట్, యాప్ అచేతన స్థితిలో ఉన్నాయి. దీంతో తమ ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫిర్యాదుదారులకు నిరాశ ఎదురవుతోంది.
సాంకేతిక సమస్యల వల్ల పనిచేయడం లేదని చాలామంది భావించారు. కాగా, ఈ రెండింటినీ నిర్వహించే బాధ్యతలను ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీకి అప్పగించారు. కొన్ని నెలలుగా సంబంధిత సంస్థకు నిర్వహణ చార్జీలు చెల్లించకపోవడంతో యాప్, వెబ్‌సైట్ సేవలు నిలిచిపోయినట్టు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి: