సైబర్ దర్యాప్తు శిక్షణలో ఏపీ పోలీస్ సత్తా
ABN , Publish Date - Nov 25 , 2026 | 05:35 AM
జాతీయస్థాయి సైబర్ క్రైం దర్యాప్తు శిక్షణలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన ఎస్‌ఐ ఈ.శ్రీరచన ద్వితీయ స్థానం సాధించారు.
జాతీయ స్థాయిలో ఎస్‌ఐ శ్రీరచనకు ద్వితీయ స్థానం
విజయవాడ, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): జాతీయస్థాయి సైబర్ క్రైం దర్యాప్తు శిక్షణలో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు చెందిన ఎస్‌ఐ ఈ.శ్రీరచన ద్వితీయ స్థానం సాధించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పోలీసు బలగాలకు చెందిన అధికారులతో పోటీపడి ఈ ఘనత సాధించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీఐడీ సైబర్ క్రైం విభాగంలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్‌లోని కేంద్రీయ గూఢచారి శిక్షణ సంస్థ(సీడీటీఐ)లో నవంబరు 9 నుంచి 20 వరకు సైబర్ నేరాల దర్యాప్తుపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. డిజిటల్ ఆధారాల సేకరణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సైబర్ నేరాల విశ్లేషణ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఇందులో ప్రతిభ కనబరిచిన శ్రీరచనకు సీడీటీఐ డైరెక్టర్ సల్మాన్ తాజ్ పాటిల్ ప్రశంసా పత్రం, శిక్షణ ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి