నేరాల ఛేదనలో జాగిలాలు కీలకం
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:50 AM
మాదక ద్రవ్యాలు పొరల్లో దాచినా గుర్తించే సామర్థ్యం ఏపీ పోలీసు శాఖలోని జాగిలాలకు ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. పేలుడు పదార్థాల గుర్తింపు నుంచి సంచలన కేసుల్లో ఆధారాలను పసిగట్టడంలో మన పోలీసు జాగిలాల ట్రాక్ అద్భుతంగా ఉందన్నారు.
ఒక్కో జాగిలానికి 2 రకాల నైపుణ్యాలు: హోంమంత్రి అనిత
97కేసుల్లో కీలక ఆధారాలు గుర్తించాయి: డీజీపీ
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాలు పొరల్లో దాచినా గుర్తించే సామర్థ్యం ఏపీ పోలీసు శాఖలోని జాగిలాలకు ఉందని హోంమంత్రి అనిత తెలిపారు. పేలుడు పదార్థాల గుర్తింపు నుంచి సంచలన కేసుల్లో ఆధారాలను పసిగట్టడంలో మన పోలీసు జాగిలాల ట్రాక్ అద్భుతంగా ఉందన్నారు. రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చిన 36 జాగిలాలు నేరాల్ని పసిగట్టే సేవల్లోకి బుధవారం ప్రవేశించాయి. మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్‌లో హోంమంత్రి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 218జాగిలాలు నేరాల కట్టడిలో సేవలందిస్తున్నాయని, నేర స్థలానికి డాగ్ స్క్వాడ్ వచ్చిందంటే నేరస్ధుడు పట్టుబడినట్లేనని అన్నారు. డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఏడాది రాష్ట్రంలోని 97కేసుల్లో జాగిలాలు ఫలితాలు సాధించాయని, వాటిలో డ్రగ్స్ గుర్తింపుతో పాటు హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, హింసాత్మక నేరాలు ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’