Share News

వైసీపీవి దిగజారుడు రాజకీయాలు

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:58 AM

‘జనసేన పార్టీ పేరుతో జరిగిన ఉద్యోగాల మోసం కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ సీఐడీకి అందించాం. అయినా వైసీపీ దురుద్దేశంతోనే జనసేనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ...

వైసీపీవి దిగజారుడు రాజకీయాలు

  • ఉద్యోగాల మోసాలపై సీఐడీకి ఆధారాలు ఇచ్చాం

  • పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శివశ్రీనివాసరావు

మంగళగిరి, తిరుపతి(కొర్లగుంట), నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ‘జనసేన పార్టీ పేరుతో జరిగిన ఉద్యోగాల మోసం కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ సీఐడీకి అందించాం. అయినా వైసీపీ దురుద్దేశంతోనే జనసేనపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తూ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది’ అని రాష్ట్ర పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్యాణం శివ శ్రీనివాసరావు ఆరోపించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా నిందితులు వినియోగించిన నకిలీ పత్రాలను మీడియా ముందు ప్రదర్శించారు. బోడపాటి ధరణీ కృష్ణ, నిమ్మకాయల పెద్దిరాజు అనే ఇద్దరూ కలసి ఆయన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తూ రూ.7 కోట్లు వసూలు చేసిన విషయాన్ని విపులంగా వివరించారు. వారి మోసపూరిత వ్యవహారంపై కోట రుక్మిణితో కలసి మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఈ నెల 11న ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 12న ధరణి అనే అమ్మాయి మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తనను పెద్దిరాజు మోసం చేశాడంటూ ఫిర్యాదు చేసింది. దీనికి ముందు ఆమె నాకు వాట్సా్‌పలో లేఖ పంపించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్


దానిలో... ‘నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి’ అని పేర్కొంది. ఈ క్రమంలో ఆమె నాకు పంపిన వీడియో మెసేజ్‌లను, లేఖను పోలీసులకు సాక్ష్యాలుగా అందించానని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ నుంచి తమను దూరం చేయాలనే కుట్రతోనే పార్టీలోనే ఉన్న ఓ నలుగురైదుగురు కలిసి కట్టప్పల్లా వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. జాప్యం జరగరాదనే కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిందన్నారు. ఈకేసులో పెద్దిరాజు అనే వ్యక్తి మూల పాత్రధారుడని చెప్పారు. గతంలో వైసీపీ వీరాభిమానిగా పనిచేసిన పెద్దిరాజు 2024లో ప్రభుత్వం వచ్చాకే జనసేనలో చేరాడని వివరించారు.

జనసేన కార్యాలయంలో స్కాం అవాస్తవం: కిరణ్‌ రాయల్‌

జనసేన కేంద్ర కార్యాలయంలో రూ.7 కోట్ల స్కాం జరిగిందన్న ప్రచారం అవాస్తవమని ఆ పార్టీ నేత కిరణ్‌ రాయల్‌ అన్నారు. బుధవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. ‘పవన్‌ కల్యాణ్‌, జనసేన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వాస్తవాలు తెలుసుకోకుండా ఆ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ ఇష్టానుసారంగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. ఉద్యోగాల పేరుతో మోసం జరిగిందని పేటీఎం బ్యాచ్‌లు, వైసీపీ డాగ్స్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ పీఏలు ఎవరూ అవినీతికి పాల్పడే అవకాశం లేదు. జగన్‌ హయాంలో ఆయన పీఏ కేఎన్‌ఆర్‌ చేసిన స్కాములు ఇటీవలే బయటపడ్డాయి. కేఎన్‌ఆర్‌ అకృత్యాలు బయటపెట్టడానికి నిమిషం పట్టదు. అయితే మేం వ్యక్తిగత విషయాలను బయట పెట్టడం లేదు. రాజకీయ విమర్శల పేరుతో జనసేన మహిళా నేతలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడితే సహించేది లేదు. ఎన్‌ఆర్‌ఐ కోట రుక్మిణికి జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరారు. వాస్తవాలు తెలియకుండా ప్రచారాలు చేయడం మంచి పద్ధతి కాదు’ అని కిరణ్‌ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 05:58 AM