హార్టికల్చర్ హబ్‌పై విస్తృత ప్రచారం: అచ్చెన్న
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:39 AM
రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్ది.. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్- రైజింగ్ రాయలసీమ’ కార్యక్రమాన్ని ప్రజా భాగస్వామ్యంతో..
అమరావతి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యాన కేంద్రంగా తీర్చిదిద్ది.. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్- రైజింగ్ రాయలసీమ’ కార్యక్రమాన్ని ప్రజాభాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. సంబంధిత జిల్లాల కలెక్టర్లతో మంత్రి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘రాయలసీమలోని 8 జిల్లాలతో పాటు ప్రకాశం, మార్కాపురం కలిపి 10 జిల్లాల్లో 201 క్లస్టర్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడితో ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెలవ్‌పమెంట్ ప్రాజెక్ట్‌ను అక్టోబరు 2న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, సీఎం చంద్రబాబు మదనపల్లెలో ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు అమలు కోసం సాగునీటి రంగానికి రూ.20,884కోట్లు, ఉద్యాన రంగానికి రూ.14,906కోట్లు, గ్రామీణ రహదార్ల అభివృద్ధికి రూ.4,562కోట్లు వెచ్చించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు