ప్రచారంలో ‘హద్దు’దాటొద్దు!
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:26 AM
ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచికలమర్రు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సరిహద్దుల గొడవ తలెత్తింది. కొల్లేరు ప్రాంతంలో గ్రామ పెద్దల కట్టుబాట్ల మధ్య సర్పంచ్ ఎన్నికలు ఏకగీవ్రంగా నిర్వహిస్తుంటారు
ఏలూరు జిల్లా కైకలూరు మండలం పెంచికలమర్రు పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సరిహద్దుల గొడవ తలెత్తింది. కొల్లేరు ప్రాంతంలో గ్రామ పెద్దల కట్టుబాట్ల మధ్య సర్పంచ్ ఎన్నికలు ఏకగీవ్రంగా నిర్వహిస్తుంటారు. గత ఎన్నికల్లో జయమంగళ యువరాజు సర్పంచ్‌గా పోటీచేసి ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన భార్య రాజ్యం సర్పంచ్ (మహిళకు రిజర్వుడు)గా పోటీ చేస్తున్నారు. శివారు గ్రామమైన వడ్లకూటితిప్పకు చెందిన గొల్ల పేరంటాలు కూడా సర్పంచ్‌గా పోటీకి దిగడంతో.. పోటీ వద్దని గ్రామపెద్దలు ఆమెకు నచ్చజెప్పారు. అయినా ఆమె వెనక్కు తగ్గలేదు.
అప్పటి నుంచి ఇది గ్రామాల మధ్య వివాదంగా మారింది. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రాజ్యంను వడ్లకూటితిప్ప గ్రామస్థులు అడ్డుకున్నారు. గురువారం పెంచికలమర్రులో ఎన్నికల ప్రచారానికి గొల్ల పేరంటాలు రావడంతో ఆ గ్రామస్థులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు గ్రామ సెంటర్లో బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ గ్రామంలో 1,788 ఓట్లు ఉండగా, వీటిలో మూడొంతుల ఓటర్లు పెంచికలమర్రులో, ఒక వంతు ఓటర్లు వడ్లకూటితిప్పలో ఉన్నారు.
- కైకలూరు, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా