సపరివార సమేతంగా!
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:06 AM
కర్నూలు జిల్లాలో ఒక కుటుంబంలో ముగ్గురు, మరో కుటుంబంలో భార్యాభర్తలు వివిధ పదవులకు ఎన్నికయ్యారు. టీడీపీ నేత కె.తుగ్గలి నాగేంద్ర జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కొనసాగుతుండగా...
ఒకే ఇంట్లో ముగ్గురికి పదవులు
కర్నూలు జిల్లాలో ఒక కుటుంబంలో ముగ్గురు, మరో కుటుంబంలో భార్యాభర్తలు వివిధ పదవులకు ఎన్నికయ్యారు. టీడీపీ నేత కె.తుగ్గలి నాగేంద్ర జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా కొనసాగుతుండగా.. ఆయన భార్య కె.వరలక్ష్మి తుగ్గలి ఎంపీటీసీగా విజయం సాధించి, ఎంపీపీగా ఎన్నికయ్యారు. వీరి కుమార్తె, యువన్యాయవాది కె.సాయి చంద్రిక కూటమి మద్దతుతో గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు ఆదోని-2 మండలం చిన్నహరివాణం ఎంపీటీసీగా టీడీపీకి చెందిన గోనేహాల్ సులోచనరెడ్డి గెలిచి, ఏకగ్రీవంగా ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఆమె భర్త గోనేహాల్ గోపాల్‌రెడ్డి కూటమి మద్దతుతో చిన్న హరివాణం సర్పంచ్‌గా గెలుపొందారు.
- కర్నూలు, ఆంధ్రజ్యోతి
అత్త ఎంపీపీ, మామ ఎంపీటీసీ, కోడలు సర్పంచ్
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో అత్త, మామ, కోడలు ప్రజాప్రతినిఽధులుగా ఎన్నికయ్యారు. మాదిన విమల.. శ్రీరాంపురం ఎంపీటీసీగా గెలిచి కంచిలి ఎంపీపీగా ఎన్నికయ్యారు. కొక్కిలిపుట్టుగ ఎంపీటీసీగా విమల భర్త మాదిన రామారావు గెలిచారు. గురువారం పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో విమల కోడలు మాదిన యమున శ్రీరాంపురం సర్పంచ్‌గా విజయం సాధించారు.
- కంచిలి, ఆంధ్రజ్యోతి
ఒకే ఒక్క పోస్టల్ బ్యాలెట్‌తో విజయం
బాపట్ల జిల్లాలో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ అభ్యర్థిని విజయం వరించింది. యద్దనపూడి మండలం పడమటి పెద్దివారిపాలెం పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీచేసిన టీడీపీ మద్దతుదారులు కొల్లా శివపార్వతి, రావి శిరీషకు చెరో 133 ఓట్లు వచ్చాయి. ఫలితం టై అయిందని భావించగా.. ఒకే ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు కొల్లా శివపార్వతికి వచ్చింది. దీంతో అధికారులు ఆమెను విజేతగా ప్రకటించారు.
ఈ వార్తలనూ చదవండి:
2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు
బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా