Share News

23 పట్టణ సంస్థల్లో 1774 నామినేషన్లు

ABN , Publish Date - Nov 16 , 2026 | 01:09 AM

రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ రెండోరోజూ కొనసాగింది.

23 పట్టణ సంస్థల్లో 1774 నామినేషన్లు

  • పంచాయతీల్లోనూ ప్రకియ్ర ప్రారంభం

  • తొలిరోజు సర్పంచ్‌లకు 3282, వార్డుల కోసం 5754

అమరావతి, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 23 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ రెండోరోజూ కొనసాగింది. ఆదివారం సాయంత్రానికి మొత్తం 1774 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ల మేయర్‌ స్థానాలకు మొత్తం 22 నామినేషన్లు అందాయి. ఈ కార్పొరేషన్లలో 260 వార్డులకు గాను 510 నామినేషన్లు దాఖలయ్యాయి. 19 మున్సిపాలిటీ, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ పోస్టులకు 63 నామినేషన్లు, 749 వార్డులకు 1177 నామినేషన్లు దాఖలయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తెలిపింది. ఈ 23 పట్టణ సంస్థల్లో నామినేషన్ల దాఖలుకు సోమవారమే ఆఖరి రోజు.

ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపాలిటీకి రెండో రోజు ఆదివారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్‌ పదవికి 2, వార్డు సభ్యుల పదవులకు 64 వచ్చినట్లు సహాయ ఎన్నికల అధికారి అనూష చెప్పారు. మార్కాపురం జిల్లా పొదిలి నగర పంచాయతీలో చైర్మన్‌ పదవికి 7 నామినేషన్లు రాగా. 28 వార్డులకు 33 వచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిదశ నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజే సర్పంచ్‌ల పదవుల కోసం 3282, వార్డులకు 5754 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి విడతలో మొత్తం 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల పరిధిలో 4180 గ్రామ పంచాయతీలకు ఈ నెల 26న పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 01:13 AM