Share News

2 రోజుల్లో 76 వేల నామినేషన్లు

ABN , Publish Date - Nov 24 , 2026 | 03:05 AM

రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పోటాపోటీగా సాగింది. 21, 22 తేదీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు ఏకంగా 76 వేల మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు.

2 రోజుల్లో 76 వేల నామినేషన్లు

  • 4,244 గ్రామాల్లో సర్పంచ్‌లకు 16,505

  • వార్డు పదవులకు 60,420 దాఖలు

  • మూడో విడత ఎన్నికల్లో పోటా పోటీ

అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పోటాపోటీగా సాగింది. 21, 22 తేదీల్లో సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవులకు ఏకంగా 76 వేల మందికి పైగా నామినేషన్లు దాఖలు చేశారు. మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్న 25 జిల్లాల్లోని 4,244 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌ పదవులకు 16,505 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 60,420 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్‌ పదవులకు మొదటి రోజు 4,929, రెండో రోజు 11,576 నామినేషన్లు అందాయి. వార్డు సభ్యుల పదవులకు తొలిరోజు 13,611, రెండో రోజు 46,809 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఈ వార్తలనూ చదవండి:

చేతులెలా వచ్చాయ్‌!

నామినీ ఉంటేనే బీమా

Updated Date - Nov 24 , 2026 | 03:10 AM