Share News

రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 01:51 AM

మూడు విడతల్లో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. శుక్రవారం (13న) మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌

  • మూడు విడతల్లో... 26, 29, 2న పోలింగ్‌

అమరావతి, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మూడు విడతల్లో నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. శుక్రవారం (13న) మొదటి విడత గ్రామ పంచాయతీల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. రెండో విడతకు 16న, మూడో విడతకు 19న షెడ్యూల్‌ విడుదల అవుతుంది. మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు/ఎన్నికల అధికారులు 15న ఎన్నికల నోటీసు ఇస్తారు. 17లోపు నామినేషన్లు స్వీకరిస్తారు. 18న పరిశీలిస్తారు. తిరస్కరించిన నామినేషన్లను అప్పీలు చేసుకునేందుకు 19, పరిష్కరించేందుకు 20, ఉపసంహరణకు 21 ఆఖరు తేదీలుగా నిర్ణయించారు. అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు.

మొదటి విడతకు సంబంధించి ఈ నెల 26న ఓటింగ్‌, అదే రోజు కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఎక్కడైనా రీపోల్‌ నిర్వహించాల్సి వస్తే 27న చేపడతారు. అదే రోజు గాని, ఆ మరుసటి రోజుగాని ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉప సర్పంచ్‌లను ఎన్నుకుంటారు. చిన్న రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఒకేసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. పెద్ద డివిజన్లకు మాత్రం రెండు దఫాలుగా నిర్వహిస్తారు. తొలి దశలో 39 రెవెన్యూ డివిజన్లలోని 209 మండలాల పరిధిలోని పంచాయతీల్లో 26న ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశలో 46 డివిజన్లలో 239 మండలాలు, మూడో విడతలో 43 రెవెన్యూ డివిజన్లలో 205 మండలాల పరిధిలోని పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 01:53 AM