Share News

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష వాయిదా

ABN , Publish Date - Nov 18 , 2026 | 01:23 AM

నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షను వాయిదా వేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష వాయిదా

ఈ నెల 29కి బదులు వచ్చే నెల13న నిర్వహణ: డైరెక్టర్‌ వెల్లడి

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీం(ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షను వాయిదా వేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. షెడ్యూలు ప్రకారం ఈ నెల 29న పరీక్ష నిర్వహించాల్సి ఉందన్నారు. అయితే, అదే రోజు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌ ఉండటంతో డిసెంబరు 13న పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 01:26 AM