Share News

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ABN , Publish Date - Oct 26 , 2026 | 05:21 AM

దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సేవలందించి పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి సమావేశం విజయవాడలోని ఎన్జీవో హోంలో ఆదివారం జరిగింది.

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి

ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్‌

విజయవాడ (గాంధీనగర్‌), అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి) : దశాబ్దాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సేవలందించి పదవీ విరమణ చేసిన పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్రస్థాయి సమావేశం విజయవాడలోని ఎన్జీవో హోంలో ఆదివారం జరిగింది. విద్యాసాగర్‌ మాట్లాడుతూ పెన్షనర్ల వయస్సు, ఆరోగ్య అవసరాలు, ఆర్థిక, సాంకేతిక సమస్యలు, పదవీ విరమణ ప్రయోజనాలకు సంబంధించిన అంశాల పరిష్కారానికి సంఘం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

పెన్షనర్లకు హెల్త్‌కార్డుల ద్వారా పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్యసేవలు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. హెల్త్‌కార్డుల ద్వారా అందించే వైద్యసేవలకు సంబంధించి బిల్లుల చెల్లింపులు నేరుగా ట్రస్ట్‌కు చేరేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి జె.రామారావు, ఎన్జీజీవో నాయకులు సత్యనారాయణరెడ్డి, సీవీఆర్‌ ప్రసాద్‌, నజీర్‌, దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఓటరు తీరుమారేనా?

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

Updated Date - Oct 26 , 2026 | 05:21 AM