పెట్టుబడులు వస్తుంటేఓర్వలేక జగన్ విషప్రచారం: గణబాబు
ABN , Publish Date - Nov 24 , 2026 | 04:06 AM
సీఎం చంద్రబాబు అనుభవం, మంత్రి లోకేశ్ సమర్థమైన పనితీరు వల్ల రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని ఎమ్మెల్యే గణబాబు అన్నారు.
అమరావతి, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు అనుభవం, మంత్రి లోకేశ్ సమర్థమైన పనితీరు వల్ల రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. ‘కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 35 నూతన పాలసీలు పారిశ్రామికవేత్తలను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో 714 సంస్థలతో రూ.22.60 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను చూసి ఓర్వలేక జగన్ తన మీడియాలో డేటా చోరీ అంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రం బాగుపడుతుంటే సంతోషించకుండా నాశనం కావాలని కోరుకోవడం జగన్‌కే చెల్లుతుంది.’ అని గణబాబు మండిపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి: