Share News

బాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదు

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:31 AM

సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు.

బాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదు

  • మంత్రి సవిత

పెనుకొండ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని మంత్రి సవిత అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘తుఫానులు, కొవిడ్‌ సమయంలో జగన్‌ అడుగు బయటపెట్టలేదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరామర్శించిన నాయకుడు చంద్రబాబు. గతంలో తుఫాన్‌లు వచ్చినప్పుడు జగన్‌ ఎక్కడ ఉన్నారు..? ఐమాక్స్‌ థియేటర్‌లో సినిమా చూస్తూ ఎంజాయ్‌ చేశారు. సినిమా సెట్టింగులు వేసుకుని పంట నష్టాన్ని అంచనా వేశారు’ అని మండిపడ్డారు.

హుద్‌హుద్‌ తుఫాన్‌ వచ్చినప్పుడు సీఎం చంద్రబాబు స్వయంగా కలెక్టరేట్‌లో ఉండి పర్యవేక్షించారు. అధికారులు, ప్రజాప్రతినిధులను క్షేత్రస్థాయికి పంపించి.. ఆర్నబ్‌ తుఫాన్‌ నష్టాన్ని చంద్రబాబు తగ్గించగలిగారు. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 42 మంది చనిపోయినా జగన్‌ పరామర్శించలేదు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత ఉందా?’ అని మంత్రి మండిపడ్డారు.

ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 04:31 AM