Share News

ప్రతి ఎన్నికనూ సీరియస్‌గా తీసుకోండి

ABN , Publish Date - Nov 28 , 2026 | 06:08 AM

‘ఎన్నికను ఎన్నికగానే చూడాలి. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఎన్నికనూ సీరియస్‌గా తీసుకోవాలి’ అని మంత్రి లోకేశ్‌ అన్నారు.

ప్రతి ఎన్నికనూ సీరియస్‌గా తీసుకోండి

పట్టణ, పరిషత్‌ ఎన్నికలకన్నా పంచాయతీల్లో ఎక్కువ కష్టపడాలి: లోకేశ్‌

అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికను ఎన్నికగానే చూడాలి. చిన్నదైనా, పెద్దదైనా ప్రతి ఎన్నికనూ సీరియస్‌గా తీసుకోవాలి’ అని మంత్రి లోకేశ్‌ అన్నారు. శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో పంచాయతీ ఎన్నికల తీరుపై టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘పోలింగ్‌ ఎంత ఎక్కువ జరిగితే మన మెజార్టీలు అంత ఎక్కువ పెరుగుతాయి. పట్టణ, పరిషత్‌ ఎన్నికల్లో ఎంత కష్టపడ్డామో పంచాయతీ ఎన్నికల్లోనూ అంత కంటే ఎక్కువ కష్టపడి పనిచేయాలి. జనసేన, బీజేపీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి. కూటమి మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులందరికీ నా అభినందనలు. కూటమి విజయ పరంపర కొనసాగుతోంది. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం... పంచాయతీ ఎన్నికల వరకు కొనసాగుతూనే ఉంది. తొలివిడత పం చాయతీ ఎన్నికల్లో కూటమి బలపర్చిన అభ్యర్థులు అద్భుత విజయాలు సాధించారు. జరగబోయే రెండు, మూడు విడత పంచాయతీ ఎన్నికల్లోనూ... కూటమి మద్దతు అభ్యర్థులు విజయం సాధించాలి’ అని పార్టీ శ్రేణులకు సూచించారు.

‘పంచాయతీ’లో వైసీపీకి ప్రజామద్దతు కరువు: పల్లా

రాష్ట్రంలో జరిగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమికి ప్రజలు మద్దతు తెలపడం ప్రభుత్వంపై వారికున్న నమ్మకానికి నిదర్శనమని, వైసీపీకి ప్రజామద్దతు కరువైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘కుప్పం మండలం వానగుట్టపల్లిలో వైసీపీ నేతల దాష్టీకానికి మృతిచెందిన రాజేంద్రన్‌ టీడీపీ కార్యకర్త. ఆయనకు పార్టీ సభ్యత్వం ఉంది. తమ కార్యకర్త మృతి చెందినట్లు ప్రచారం చేస్తూ, వైసీపీ నాయకులు టీడీపీపై నిందలేయడం విడ్డూరం’ అన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 06:11 AM