26న ఏలూరు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:07 AM
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఏలూరు జిల్లా నుంచి ఈ నెల 26న ప్రారంభిస్తామని రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
37 లక్షల టన్నుల సేకరణ లక్ష్యం: నాదెండ్ల మనోహర్
ఏలూరు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఏలూరు జిల్లా నుంచి ఈ నెల 26న ప్రారంభిస్తామని రాష్ట్ర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. గురువారం ఏలూరు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించాం. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా గోనెసంచులు సిద్ధం చేయడంతోపాటు, రైతు సేవా కేంద్రాలను సన్నద్ధం చేయాలి. ధాన్యం కొన్న 24 గంటల్లో కనీస మద్దతు ధరతోపాటు, రవాణా ఖర్చులను రైతుల ఖాతాకు జమ చేస్తాం’ అని మంత్రి చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..
డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు