Share News

పచ్చి అబద్ధాలు చెప్పడం వైసీపీకి అలవాటే: లోకేశ్‌

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:51 AM

‘పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రశ్నల నుంచి పారిపోవడం, నిజాలు వెల్లడించినందుకు మీడియాపై బెదిరింపులకు దిగడం వైసీపీకి అలవాటుగా మారింది’ అని మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు.

పచ్చి అబద్ధాలు చెప్పడం వైసీపీకి అలవాటే: లోకేశ్‌

అమరావతి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ‘పచ్చి అబద్ధాలు చెప్పడం, ప్రశ్నల నుంచి పారిపోవడం, నిజాలు వెల్లడించినందుకు మీడియాపై బెదిరింపులకు దిగడం వైసీపీకి అలవాటుగా మారింది’ అని మంత్రి లోకేశ్‌ మండిపడ్డారు. ‘ఇండియా టుడే కాంక్లేవ్‌ సదస్సు నుంచి వైసీపీని ఎందుకు మినహాయించారో సమాధానం చెప్పాలి’ అంటూ ఆ పార్టీ ఎక్స్‌ వేదికగా ఇండియా టుడేని ప్రశ్నించింది. దీనిపై ఇండియా టుడే జర్నలిస్టు అక్షిత నందగోపాల్‌ స్పందిస్తూ... ‘వైసీపీని కూడా ఆహ్వానించాం. కానీ ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. ఈ సమాచారం అంతా ఆ పార్టీకి ముందుగానే తెలుసు’ అని పేర్కొన్నారు. దీని లోకేశ్‌ గురువారం ఎక్స్‌లో స్పందించారు. ‘అధికారంలో ఉన్నా, లేకున్నా ఆ పార్టీ ధోరణిలో ఎలాంటి మార్పు లేదు’ అని విమర్శించారు.

ఈ వార్తలనూ చదవండి:

వివేకా కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. వారికి నోటీసులు

ప్రభుత్వ భూములకు స్కెచ్‌

Updated Date - Oct 02 , 2026 | 05:51 AM