Share News

రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ

ABN , Publish Date - Nov 16 , 2026 | 04:47 AM

రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ వచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..

రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు: మంత్రి కొండపల్లి

విజయనగరం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ వచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఆదివారం తన నివాసంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తోందన్నారు. రెండున్నరేళ్లలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ సారథ్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పలు పరిశ్రమలు ఏర్పాటయ్యాయని చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో జరిగిన సదస్సులో కూడా పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న క్రికెట్‌ క్రీడాకారుడు జాంటీరోడ్స్‌ కూడా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు.

రానున్న రెండున్నరేళ్లలో రాష్ట్రానికి మరెన్నో పరిశ్రమలు రానున్నాయన్నారు. తద్వారా సూపర్‌సిక్స్‌లో భాగంగా ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీ అమలుకు రోడ్‌మ్యాప్‌ ఏర్పడుతుందని తెలిపారు. విజయనగరం జిల్లాలో ఏర్పాటవుతున్న పలు పరిశ్రమల్లో స్థానికులకు అవకాశాలు ఉండడం లేదన్న విషయాన్ని పరిశీలిస్తామన్నారు. నిబంధనల ప్రకారం స్థానికులకు అవకాశాలు దక్కుతాయని భరోసా ఇచ్చారు.

ఈ వార్తలనూ చదవండి:

సొంత వైద్యం.. ప్రాణాలకే ముప్పు

ఏపీలో జోరుగా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు..!

Updated Date - Nov 16 , 2026 | 04:49 AM