ఏపీకి సాయం చేయండి
ABN , Publish Date - Oct 31 , 2026 | 05:03 AM
అర్నబ్ తుఫాను మిగిల్చిన విధ్వంసం నుంచి కోలుకునేందుకు తమకు సాయం చేయాలని తమిళనాడు విద్యుత్తుశాఖ మంత్రిని ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు.
తమిళనాడు విద్యుత్తుశాఖ మంత్రికి గొట్టిపాటి ఫోన్
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాను మిగిల్చిన విధ్వంసం నుంచి కోలుకునేందుకు తమకు సాయం చేయాలని తమిళనాడు విద్యుత్తుశాఖ మంత్రిని ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కోరారు. శుక్రవారం తమిళనాడు మంత్రికి ఫోన్ చేసిన గొట్టిపాటి.. అర్నబ్ వల్ల జరిగిన నష్టాన్ని వివరించారు. విద్యుత్తు పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు సిబ్బంది, సామగ్రిని పంపాలని గొట్టిపాటి కోరగా తమిళనాడు మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?