Share News

జగన్‌ అవినీతి వల్లే ప్రజాప్రతినిధులు జైలుకు

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:21 AM

వైసీపీ అధినేత జగన్‌ అవినీతి వల్లే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికార్లు మద్యం కుంభకోణం కేసుల్లో జైలు పాలయ్యారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు.

జగన్‌ అవినీతి వల్లే ప్రజాప్రతినిధులు జైలుకు

  • మద్యం కుంభకోణంలో ఉన్నతాధికారులూ జైలుకే

  • టీడీపీకి అనుకూలమని బీసీలపై జగన్‌కు కక్ష: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

కలెక్టరేట్‌(కాకినాడ), అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత జగన్‌ అవినీతి వల్లే మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఉన్నతాధికార్లు మద్యం కుంభకోణం కేసుల్లో జైలు పాలయ్యారని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. కాకినాడలో సోమవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘వివేకానంద హత్యకేసులో సైతం రూ.40 కోట్లు సుపారీ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సుపారీ అంశంపై వేళ్లు అన్నీ జగన్‌వైపే చూపిస్తున్నాయి. బీసీలకు రాజకీయంగా సముచితస్థానం కల్పించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, వైసీపీ అడ్డంకులు సృష్టిస్తుంది. స్థానిక ఎన్నికల్లో కూటమి తరఫున బీసీలకు 40శాతంకు పైగా ప్రాధాన్యం కల్పించాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. బీసీలు మొదటి నుంచి టీడీపీకి అనుకూలంగా ఉన్నారనే కక్షతో జగన్‌ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు’ అని మంత్రి జనార్దన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షుడు మల్లిపూడి వీరేంద్ర పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పెట్టుబడుల స్వర్గధామం ఏపీ

నాడు అడ్డగోలు.. నేడు గగ్గోలు

Updated Date - Oct 13 , 2026 | 05:21 AM