Share News

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. వైద్య సేవల్లో కొత్త అధ్యాయం

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:13 PM

పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్యం మరింత చేరువ కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 22 కీలక వైద్య ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. వైద్య సేవల్లో కొత్త అధ్యాయం
Andhra Pradesh Medical Projects

విజయవాడ, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లో వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబరేటరీలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వర్చువల్‌గా ప్రారంభించారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు. మొత్తం రూ.249 కోట్ల వ్యయంతో 22 వైద్య ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా 500 క్రిటికల్ కేర్ బెడ్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.


ఈ క్రిటికల్ కేర్ యూనిట్లలో అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అల్ట్రాసౌండ్ సదుపాయాలతో పాటు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ వంటి కీలక వైద్య విభాగాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర వైద్యం మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఈ సదుపాయాలను ఏర్పాటు చేశారు. అత్యాధునిక వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు దోహదపడనున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవల సామర్థ్యాన్ని పెంచడంలో ఈ కొత్త మౌలిక వసతులు కీలకంగా మారనున్నాయి.


ఇవి కూడా చదవండి:

‘సూపర్‌ సిక్స్‌’తో ఆర్థిక భద్రత

హాలు బయటే కలెక్టర్ల సెల్‌ఫోన్లు

Read Latest AP News And Telangana News

Updated Date - Sep 12 , 2026 | 01:35 PM