Share News

హెచ్‌బీ స్ట్రిప్స్‌ టెండర్లలో గోల్‌మాల్‌!

ABN , Publish Date - Nov 15 , 2026 | 01:08 AM

వైద్య పరికరాలు, మందులను అధిక ధరలకు కొనుగోలు చేయడం ఏపీ మెడికల్‌ కార్పొరేషన్‌ అధికారులకు పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఒక్కోటీ రూ.4.45 విలువ చేసే హెచ్‌బీ స్ట్రిప్‌ను ఏకంగా రూ.9.45కు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు.

హెచ్‌బీ స్ట్రిప్స్‌ టెండర్లలో గోల్‌మాల్‌!

  • సింగిల్‌ బిడ్డర్‌కు రూ.33.54 కోట్ల టెండర్‌

  • రూ.4.45 విలువైన స్ట్రిప్‌కు రూ.9.45 చెల్లింపు

  • ప్రభుత్వంపై రూ.17.57 కోట్ల అదనపు భారం

అమరావతి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): వైద్య పరికరాలు, మందులను అధిక ధరలకు కొనుగోలు చేయడం ఏపీ మెడికల్‌ కార్పొరేషన్‌ అధికారులకు పరిపాటిగా మారింది. ప్రస్తుతం ఒక్కోటీ రూ.4.45 విలువ చేసే హెచ్‌బీ స్ట్రిప్‌ను ఏకంగా రూ.9.45కు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం బిడ్‌ ఫైనలైజేషన్‌ కమిటీ నిబంధనలకు విరుద్ధంగా సింగిల్‌ బిడ్డర్‌కు టెండర్‌ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఈ టెండర్‌ దక్కించుకున్న కంపెనీ హరియాణా ప్రభుత్వానికి ఇవే హెచ్‌బీ స్ట్రిప్స్‌ను రూ.4.45కే సరఫరా చేస్తుండటం గమనార్హం. వచ్చే మూడేళ్లలో ఏపీ ప్రభుత్వం దాదాపు 3.54 కోట్ల హెచ్‌బీ స్ట్రిప్స్‌ కొనుగోలు చేయనుంది. ఒక్కోటీ రూ.9.45చొప్పున దాదాపు రూ.33.54 కోట్లు దీనికోసం వెచ్చించనుంది.

గుజరాత్‌, హరియాణా ప్రభుత్వాలు ఇవే స్ట్రిప్స్‌ కోసం రూ.15.97కోట్లే ఖర్చు చేస్తున్నాయి. ఏపీలో మాత్రం దాదాపు రూ.18 కోట్ల ప్రజాధానాన్ని అప్పనంగా దోచిపెట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ టెండర్‌ విషయంలో తొలినుంచీ అధికారులు తప్పటడుగులు వేస్తున్నారు. హెచ్‌బీ స్ట్రిప్స్‌ కోసం మెడికల్‌ కార్పొరేషన్‌ ఏప్రిల్‌లో టెండర్లు ఆహ్వానించగా రెండు కంపెనీలు పాల్గొన్నాయి. వాటిలో ఒకదానికి సెంట్రల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ ద్వారా ఉండాల్సిన ‘సి’ సర్టిఫికెట్‌, పేపర్‌ పబ్లికేషన్లు లేవని టెక్నికల్‌ కమిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా ఆ కంపెనీ ఫైనాన్షియల్‌ బిడ్‌ను ఉద్దేశపూర్వకంగా తెరిచి, ‘సి’ సర్టిఫికేషన్‌ లేదని బీఎఫ్‌సీలో చూపించారు. చివరకు తాము అనుకున్న కంపెనీకే టెండర్‌ కట్టబెట్టారు.

ఈ వార్తలనూ చదవండి:

జాతీయ బాలల దినోత్సవం.. చిన్నారులకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

కార్పొరేషన్‌పై కూటమి జెండా ఎగరేద్దాం

Updated Date - Nov 15 , 2026 | 01:14 AM