6,929 ఎంబీబీఎస్ సీట్లు భర్తీ
ABN , Publish Date - Nov 19 , 2026 | 03:50 AM
రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ పూర్తయిందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్ బుధవారం ప్రకటించా రు.
రాష్ట్ర కోటా సీట్లలో 99.88 శాతం పూర్తి
పూర్తయిన ఫస్టియర్ ప్రవేశాల ప్రక్రియ
అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ పూర్తయిందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయిసుధీర్ బుధవారం ప్రకటించా రు. రాష్ట్రంలో మొత్తం 7,465 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా.. వాటిలో 528 సీట్లను ఆలిండియా కోటాకు కేటాయించారు. మిగిలిన 6,937 సీట్లు రాష్ట్ర పరిధిలో ఉండగా..
వాటిలో 6,929 సీట్లు భర్తీ అయ్యాయని ఆయన వివరించారు. ఈ నెల 16తో ప్రవేశాల ప్రక్రియ ముగిసిందని వెల్లడించారు. కన్వీనర్ కోటా కింద ఉన్న 4,581 సీట్లన్నీ భర్తీ అయ్యాయని తెలిపారు. వీటిలో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,631, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 1,950 సీట్లు భర్తీ చేశామన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్