స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Sep 26 , 2026 | 05:18 AM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ క్షణంలోనైనా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్నతస్థాయి సమావేశం
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఏ క్షణంలోనైనా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సీఎస్, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా తన కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. అనివార్య కారణాల తో డీజీపీ బదులు అడిషనల్ డీజీపీ ఈ సమావేశానికి హాజరయ్యారు. మున్సిపల్, పంచాయతీరాజ్, పాఠశాల విద్య, ఎక్సైజ్ తదితర శాఖలతో ఎన్నికల ఏర్పాట్లపై చర్చించారు. మరో రెండు, మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సన్నాహాక సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్, పరీక్షలేమైనా ఉన్నాయా? ఎన్నికలకు అనువైన సమయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఈ వార్తలనూ చదవండి..
ఎన్నికల్లో మోదీని ఎదుర్కోలేకే.. అసత్య ప్రచారాలు: రామ్ మాధవ్
హథీరాంజీ మఠం భూ లీజుదారులకు సుప్రీంలో ఎదురుదెబ్బ