Share News

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ

ABN , Publish Date - Jul 16 , 2026 | 09:41 AM

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరి సునీల్‌కు మూడు రోజుల ఈడీ కస్టడీని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది.

ఏపీ లిక్కర్ స్కాం.. నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ
AP liquor Scam ED Custody

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్‌కు మూడు రోజుల ఈడీ కస్టడీని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు నేటి నుంచి మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఇందుకోసం వారిని చంచల్‌గూడ జైలు నుంచి ఈడీ కార్యాలయానికి తరలించే ఏర్పాట్లు చేశారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా టెండర్ల కేటాయింపులో భారీ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపడుతోంది. మద్యం రవాణా టెండర్ల నిబంధనలను నిబంధనలకు విరుద్ధంగా సవరించడం వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.195 కోట్ల మేర నష్టం జరిగిందని ఈడీ అభియోగం మోపింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను, సంబంధిత వ్యక్తులను విచారించిన అధికారులు, ఇప్పుడు కస్టడీలో నిందితులను ప్రశ్నించి మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేయనున్నారు.

ఈ మూడు రోజుల విచారణలో మద్యం రవాణా టెండర్ల ప్రక్రియ, ఆర్థిక లావాదేవీలు, నిధుల బదిలీలు, ఇతర కీలక అంశాలపై నిందితులను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.


Also Read:

ఐటీ షేర్లపై ఆసక్తి.. కొనసాగుతున్న లాభాలు..

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో రూ.33.50 లక్షలకు టోకరా

Updated Date - Jul 16 , 2026 | 09:58 AM