ఏపీ లిక్కర్ స్కాంలో భారీ అక్రమాలు.. ఈడీ దర్యాప్తులో వెలుగులోకి షాకింగ్ నిజాలు
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:13 PM
ఏపీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తులో మరో సంచలన విషయం వెలుగుచూసింది. మద్యం రవాణా (లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషన్) టెండర్ల కేటాయింపుల్లో భారీ అక్రమాలు జరిగినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. వివరాల్లోకి వెళితే..
అమరావతి, జూన్ 03: ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. తాజాగా మద్యం రవాణా (లిక్కర్ ట్రాన్స్‌పోర్టేషన్) టెండర్ల కేటాయింపుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గుర్తించింది. రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి ప్రభుత్వ రిటైల్ అవుట్‌లెట్లకు మద్యం సరఫరా చేసే కాంట్రాక్టుల కేటాయింపుల్లో నిబంధనలను తుంగలో తొక్కినట్లు ఈడీ విచారణలో తేలింది. లిక్కర్ రవాణా టెండర్ల ప్రక్రియలో ఢిల్లీకి చెందిన 'సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్' అనే సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి చేకూర్చినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది.
సాధారణంగా తక్కువ ధరకే నాణ్యమైన సేవలు అందించే సంస్థలకు టెండర్లు కేటాయించాల్సి ఉండగా.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మార్కెట్ ధరల కంటే 20 శాతం అధిక రేట్లు వేసినప్పటికీ, నిబంధనలను పక్కనబెట్టి మరీ సదరు సిగ్మా సంస్థకే ఈ రవాణా కాంట్రాక్టును కట్టబెట్టడం గమనార్హం. ఈడీ జరిపిన అంతర్గత విచారణ, రికార్డుల పరిశీలనలో అక్టోబర్ 2021 నుండి మార్చి 2024 మధ్య కాలంలో ఈ అక్రమ రవాణా ఒప్పందం సాగినట్లు తేలింది. ఈ రెండున్నరేళ్ల కాలంలో ప్రభుత్వ ఖజానా నుంచి సదరు సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ సంస్థకు ఏకంగా రూ.349.7 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడి ఇంట్లో ఏసీబీ సోదాలు
తెలంగాణకు నా మద్దతు సిద్ధాంతపరమే: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And Telugu News