Share News

ఉన్నత విద్యలో ఆన్‌లైన్‌ పాఠాలు

ABN , Publish Date - Nov 20 , 2026 | 05:08 AM

ఉన్నత విద్యలో సాధారణ బోధనకు సమాంతరంగా ఆన్‌లైన్‌ విధానంలో పాఠాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఉన్నత విద్యలో ఆన్‌లైన్‌ పాఠాలు

అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యలో సాధారణ బోధనకు సమాంతరంగా ఆన్‌లైన్‌ విధానంలో పాఠాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట ఏఐ, క్వాంటమ్‌ కోర్సులు రూపొందించిన ఉన్నత విద్యామండలి త్వరలో అన్ని పాఠ్యాంశాలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది.

మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.విజయభాస్కరరావు తాజాగా ఈ విధానాన్ని ప్రారంభించారు. apschelmsmoocs.orgవెబ్‌సైట్‌లో విద్యార్థులు రిజిస్ర్టేషన్‌ చేసుకుని కావాల్సిన పాఠ్యాంశాలను చదువుకోవచ్చు. ఆసక్తి ఉంటే కోర్సులు పూర్తిచేయవచ్చు. ఏఐ ఇంట్రడక్షన్‌, ఏఐ అప్లికేషన్స్‌- బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రో బయాలజీ, లైఫ్‌ సైన్సెస్‌, ఏఐ అప్లికేషన్స్‌- కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఏఐ అప్లికేషన్స్‌- హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, ఏఐ అప్లికేషన్స్‌- కంప్యూటర్‌ సైన్స్‌, డేటా సైన్స్‌, ఏఐ, డేటా అనలిటిక్స్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఫౌండేషన్స్‌... వంటి కోర్సుల్లో విద్యార్థులు దేనినైనా ఎంపిక చేసుకుని 4 నెలల్లో పూర్తిచేయవచ్చు.

కోర్సు అనంతరం ఉన్నత విద్యామండలి ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్‌తో పాటు 2 క్రెడిట్లు ఇస్తుంది. ఇవి ఉద్యోగాల సమయంలో ఉపయోగపడతాయి.

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా


ఆరు మాడ్యూల్స్‌లో అందుబాటులోకి

ఈ వెబ్‌సైట్‌లో పాఠ్యాంశాలు చదువుకునే అవకాశం కూడా కల్పించారు. కోర్సు చేసే ఆసక్తి లేకపోయినా విద్యార్థులు వాటిని చూడవచ్చు. మొత్తం ఆరు మాడ్యూల్స్‌లో పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, కాలేజీ లెక్చరర్లు 15 నుంచి 20 నిమిషాల వ్యవధితో వీడియో తయారు చేస్తున్నారు. అలాగే పాడ్‌కా్‌స్ట(ఆడియో), టెక్స్ట్‌, పీపీటీ, అసైన్‌మెంట్‌ రూపంలోనూ ఇవి అందుబాటులో ఉంటాయి.

డిజిలాకర్‌తో అనుసంధానం

ప్రస్తుతం వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకున్న ఎవరైనా పాఠ్యాంశాలను చూడొచ్చు. అయితే త్వరలో దీన్ని విద్యార్థులకే పరిమితం చేయనున్నారు. ఇందుకోసం డిజిలాకర్‌తో అనుసంధానం చేసేందుకు మండలి అనుమతి పొందిం ది. డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఉపయోగపడేలా రూపొందించిన ఆన్‌లైన్‌ పాఠాలను చూసి, కోర్సులు చేసే అవకాశం ప్రస్తుతం ఏపీ విద్యార్థులకే కల్పిస్తున్నారు. త్వరలో దేశవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ

ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి హవా

Updated Date - Nov 20 , 2026 | 06:15 AM