గ్రామీణులకు నాణ్యమైన వైద్యం
ABN , Publish Date - Oct 07 , 2026 | 04:34 AM
గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు కీలకపాత్ర పోషిస్తాయని మంత్రి సత్యకుమార్ చెప్పారు. రాష్ట్రంలో నిర్మించిన ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్-విలేజ్ హెల్త్ క్లినిక్’ భవనాలను ఆయన ప్రారంభించారు.
అదే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లక్ష్యం
ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్
267 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ప్రారంభం
గుడివాడ, అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లు కీలకపాత్ర పోషిస్తాయని మంత్రి సత్యకుమార్ చెప్పారు. రాష్ట్రంలో నిర్మించిన ‘ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్-విలేజ్ హెల్త్ క్లినిక్’ భవనాలను ఆయన ప్రారంభించారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం జొన్నపాడులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అక్కడి నుంచే రాష్ట్రంలోని 267 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్-విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2027 మార్చి నాటికి 4,500పైగా క్లినిక్‌ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను జనవరి నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి జి.వీరపాండియన్, కమిషనర్ చక్రధర్‌బాబు, ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఎండీ బి.స్మరణ్‌రాజు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు యార్లగడ్డ, వెనిగండ్ల, కాగిత, వర్ల, కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!