Share News

ఏపీలో న్యాయాధికారులకు 62 ఏళ్లకు రిటైర్మెంట్‌

ABN , Publish Date - Nov 12 , 2026 | 04:48 AM

రాష్ట్రంలోని న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీలో న్యాయాధికారులకు 62 ఏళ్లకు రిటైర్మెంట్‌

  • 2026 మార్చి 31 నుంచి వర్తింపు

  • ఇప్పటికే పదవీ విరమణ చేసినవారు తిరిగి విధుల్లోకి!

అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని న్యాయాధికారుల పదవీ విరమణ వయస్సును 61 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం 2026 మార్చి 31 నుంచి అమల్లోకి వస్తుంది. 2026 మార్చి 31 లేదా ఆ తర్వాత పదవీ విరమణ చేసిన న్యాయాధికారులు కూడా ఈ పెంపునకు అర్హులు. వారి అంగీకారం తీసుకున్న తర్వాత తిరిగి విధుల్లోకి తీసుకుని 62 ఏళ్లు వచ్చే వరకు కొనసాగిస్తారు. తిరిగి విధుల్లో చేరే అధికారులకు వేతనం, సీనియారిటీ, సర్వీస్‌ కొనసాగింపు వంటి ప్రయోజనాలు వర్తిస్తాయి.

అయితే, వారి పనితీరు, అర్హతలను హైకోర్టు పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే, వారు ఇప్పటివరకు పొందిన పదవీ విరమణ ప్రయోజనాలను ప్రభుత్వానికి అప్పగించాలి. 2026 మార్చి 31 తర్వాత రిటైరై, ఇప్పటికే కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఏదైనా ఇతర ఉద్యోగంలో గానీ, లాభదాయక పదవిలో గానీ చేరినవారికి ఈ అవకాశం వర్తించదు. ఈ నిబంధనలు అమలు చేసేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర న్యాయశాఖను ఆర్థిక శాఖ ఆదేశించింది.

ఈ వార్తలనూ చదవండి:

ఇదే స్ఫూర్తితో స్వచ్ఛాంధ్ర సాధనకు అంతా కలిసి పనిచేద్దాం: సీఎం చంద్రబాబు

15 ఏళ్ల తర్వాత లంచం కేసులో తీర్పు.. మాజీ సీఐకి ఏడాది జైలు

Updated Date - Nov 12 , 2026 | 04:50 AM