Share News

త్వరితగతిన పీఆర్సీ నివేదిక

ABN , Publish Date - Nov 18 , 2026 | 02:36 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆకాంక్షలకు అనుగుణంగా 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను వీలైనంత త్వరగా, సమగ్రంగా రూపొందించాలని...

త్వరితగతిన పీఆర్సీ నివేదిక

  • చైర్మన్‌కు ఏపీ జేఏసీ చైర్మన్‌ విద్యాసాగర్‌ విజ్ఞప్తి

అమరావతి, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆకాంక్షలకు అనుగుణంగా 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను వీలైనంత త్వరగా, సమగ్రంగా రూపొందించాలని ఏపీ జేఏసీ చైర్మన్‌, ఏపీఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌ కోరారు. మంగళవారం అమరావతి సచివాలయంలో 12వ వేతన సవరణ సంఘం చైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ను ఏపీ జేఏసీ, ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్‌ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల తరఫున పలు కీలక అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన సమస్యలు వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి న్యాయబద్ధమైన సిఫారసులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి బసవలింగారావు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జానీ పాషా, పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 02:36 AM