ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం నూతన కమిటీ ఎంపిక
ABN , Publish Date - Oct 26 , 2026 | 05:23 AM
ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగానికి 21మందితో నూతన కమిటీ ఎన్నికైంది. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర మహిళా విభాగ సదస్సులో చైర్‌పర్సన్‌గా పొన్నూరు విజయలక్ష్మి..
విజయవాడ (గాంధీనగర్), అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగానికి 21మందితో నూతన కమిటీ ఎన్నికైంది. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఆదివారం జరిగిన రాష్ట్ర మహిళా విభాగ సదస్సులో చైర్‌పర్సన్‌గా పొన్నూరు విజయలక్ష్మి, సెక్రటరీ జనరల్‌గా పి.రజని, అసోసియేట్ చైర్మన్‌గా సైకం శివకుమారెడ్డి, కోశాధికారిగా వీఎస్ సాయిలక్ష్మి ఎంపికయ్యారు. రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిల్లో పురుషులతో సమానంగా మహిళా కమిటీలను ఏర్పాటు చేయాలని, మహిళా ఉద్యోగులకు రెండేళ్ల పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళలకు ప్రత్యేక టాయిలెట్ సౌకర్యాలు కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయాల్లో శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
మహిళా ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం, సాధికారతే లక్ష్యంగా ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం