చంద్రబాబు సీఎం కావడం ఏపీ ప్రజల అదృష్టం: కేంద్ర మంత్రి కుమారస్వామి
ABN , Publish Date - Mar 22 , 2026 | 06:58 PM
చంద్రబాబు నాయుడు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండడం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరగనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమారస్వామి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.
చంద్రబాబు నాయుడు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండడం ఏపీ ప్రజలు చేసుకున్న అదృష్టమని కేంద్ర మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు. సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జరగనున్న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమారస్వామి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి కుమారస్వామికి బీజేపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు (AP CM Chandrababu Naidu).
ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఇండియాలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌కు సోమవారం శంకుస్థాపన చేయబోతున్నామని, సీఎం చంద్రబాబు నాయుడు కృషికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో అదృష్టవంతులని అన్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన విశాఖ స్టీల్‌ప్లాంట్ హిల్‌టాప్ గెస్ట్‌హౌస్‌కు చేరుకోనున్న కుమారస్వామి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబుతో కలిసి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు (Kumaraswamy statement).
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా రూ.1,47,162 కోట్ల పెట్టుబడితో స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతున్నాయి (AP Steel Plant). లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు (ఏఎంఎన్‌ఎస్) ఈ భారీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొదటి దశలో 7.3 మిలియన్ టన్నులు, రెండో దశలో 10.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పనులు చేపట్టనున్నారు. 2029 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 60 వేల నుంచి 65 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి.
ఇవి కూడా చదవండి..
ప్రధాని మోదీ అరుదైన రికార్డు.. సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా..
ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారా.. విమానం దిగుతూ తడబడిన నేపథ్యంలో చర్చ..